గత ఎన్నికలకు రెండు నెలలకు ముందు వరకు పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే.. ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పును గమనించాలని సూచించారు. పెన్షన్ ను ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా మొదలుపెట్టాం.. ప్రతీ గ్రామంలో ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం.. ప్రతీ యాభై ఇళ్ళకు ఓ వాలంటీర్ ను పెట్టాం.. 56 నెలలుగా…
జయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రజాగళం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రామవరప్పాడు గ్రామంలోని నెహ్రూనగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఈ రోజు నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి.
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్ బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది.. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం రాత్రి.. వెంకటాచలంపల్లి ప్రాంతంలో బస చేసిన విషయం విదితమే కాగా.. ఈ విడిది కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
చిత్తూరు జిల్లా కమతంపల్లిలో దారుణం జరిగింది. పుంగనూరు మండలం కమతంపల్లిలో మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.