Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 14వ రోజుకు చేరింది.. మేమంతా సిద్ధం బస్సుయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. ఎండా, వర్షాన్ని లెక్కచేయకుండా బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ధూళిపాళ్ల నుంచి బయల్దేరి ఏటుకూరు వరకూ దిగ్విజయంగా యాత్ర నిర్వహించారు సీఎం జగన్. వివిధ వర్గాల ప్రజలు యాత్రలో భాగంగా సీఎంను కలిసి, తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. మళ్లీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని.. మరిన్ని సంక్షేమపథకాలు అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అదే సమయంలో కూటమి పార్టీలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.గతంలో వారిచ్చిన హామీలు అమలుచేయలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Read Also: PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
ఇవాళ.. బస్సుయాత్ర నంబూరు బైపాస్ నుంచి ప్రారంభిస్తారు సీఎం జగన్. కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మేమంతా సిద్ధం యాత్ర విజయవాడకు రాబోతోందన్నారు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలా మేమంతా సిద్ధం యాత్ర సాగుతోందన్నారు. తమ దగ్గరకు వస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు పోటీ పడుతున్నారు. ఓవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు అభిమానులతో యాత్రలో కోలాహలం కనిపిస్తోంది.