వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు.
ప్రజా మేనిఫెస్టోపై ఎన్డీఏ నేతలు సమావేశం అయింది. ప్రజా మేనిఫెస్టో రూప కల్పనకు ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా అభిప్రాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఏప్రిల్ 9న) శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది.
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడపకొల్లు గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బొడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ పిల్ల బచ్చా రోగ్ రమేష్ అంటూ విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది.