కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది.
అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు.
రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.. మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని రైతన్నలను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోవు మూడు రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలను భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిస్సా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గత రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది అని పేర్కొనింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఉయ్యూరులో పోలికేక పెట్టినా జనం నుంచి స్పందన లేదు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు.. చంద్రబాబు కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలనే ఈ పోరాటం చేస్తున్నారు.
జనసేన పార్టీకి షాక్ ఇస్తూ.. రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ జనసేన ఇంఛార్జ్గా ఉన్న పోతిన మహేష్.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో జనసేన, పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి రాజీనామా ఆవేశంలో చేయలేదు.. సీటు రాలేదని నేను రాజీనామా చేయటం లేదన్నారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశాం.. 2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు.