Wife Kills Husband: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
CM Chandrababu: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా పోస్ట్ చేశారు.
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) అధికారులు పేర్కొన్నారు.
Army Recruitment Rally: నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు…
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగింది.
శ్రీకాకుళం జిల్లాలో పీఆర్టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్లో పర్యటించింది ఎన్హెచ్ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి.