భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. వచ్చేనెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి రానున్నారు.. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ.
గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు.
Kakani Govardhan Reddy: సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయల డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు.. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆరోపణలు చేశారు.
Paravada: అనకాపల్లి జిల్లా పరవాడపరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున మృతి చెందారు.