కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గిపోతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి 45,855 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.
Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
USA Gun Shooting: అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్బాబును శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేశ్ బాబు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు.
Tirumala: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.
Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( ఆదివారం ) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చిన ఆయన.. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు.
ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.