మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు..
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారన్న ఆమె.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని అలోచిస్తున్నారు... అడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది.. ప్రజల నుంచి సలహాల స్వీకరణ కోసం స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు.. ఏపీ అభివృద్ధి సలహాల కోసం పోర్టల్ ప్రారంభించింది ప్రణాళిక విభాగం.
కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా.. సంఘ సంస్కరణే లక్ష్యంగా ఆ మహనీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోదుంటే అతిశయోక్తి కాదు.. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తిగా నిలిచిపోతారు..
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది..
తొమ్మిరోజుల పాటు.. 11 రోజుల పాటు.. 15 రోజుల పాటు.. ఇలా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు భక్తులు.. అయితే, ఈ సారి గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు..