Tirumala Laddu: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 3.30 విచారణ జరగాల్సి ఉండగా.. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ని కొనసాగించాలా లేక సీబీఐ తరహాలో దర్యాప్తు అవసరమా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరింది. అయితే, తమ అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం కావాలని కోరారు. దాంతో అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10.30కి తిరిగి విచారణ కొనసాగిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొనింది.
Read Also: Apple Festive Sale: ఆపిల్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. ఐఫోన్లపై భారీ ఆఫర్లు
కాగా, రేపు (అక్టోబర్ 4న) ఉదయం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెబుతారో వేచి చూడాలి. ఆయన సిట్ సరిపోతుంది అంటే.. సిట్ తోనే విచారణ కొనసాగించే ఛాన్స్ లేదంటే.. సీబీఐ దర్యాప్తు అవసరం ఉందంటే.. దానిపై అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక, సిట్ దర్యాప్తును వైసీపీ తప్పుపడుతుంది. సిట్ తో విచారణ చేయించినా.. రిపోర్ట్స్ ప్రభుత్వానికి అనుకుంలంగా వస్తాయని పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ఆ దర్యాప్తు ఎంతకాలం కొనసాగుతుందో తెలియడం లేదు. మొత్తానికి కల్తీ నెయ్యిపై శుక్రవారం సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని అందరు ఎదురు చూస్తున్నారు.