డిప్యూటీ సీఎం పవన్‌కు తీవ్ర జ్వరం.. గెస్ట్‌హౌస్‌లోనే వైద్యసేవలు..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. నడకమార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన.. వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తన దీక్ష విరమించారు.. ఆ తర్వాత అక్కడే అతిథి గృహంలో బస చేశారు.. అయితే, ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. దీంతో.. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే వైద్యసేవలందిస్తున్నారు డాక్టర్లు.. మొన్నటి నుంచి అసౌకర్యంగానే ఉంటున్నారు పవన్ కల్యాణ్.. వెన్నునొప్పి కారణంగా నడకమార్గంలోనూ ఇబ్బందిపడ్డారు.. కానీ, తనకు అనారోగ్యంగా వున్నా.. ఈరోజు సాయంత్రం వారాహి సభలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, తిరుపతి వేదికగా జరిగే వారాహి బహిరంగ సభలో.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మ వ్యవస్థ కోసం డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది..
రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. రేపు సాయంత్రం 6:20కి తిరుమలకు చేరుకుంటారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్ర్తాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నారు చంద్రబాబు దంపతులు. తర్వాత శ్రీవారి ఆలయంలో గడపనున్నారు. అలాగే 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించనున్నారు సీఎం. ఎల్లుండి ఉదయం 7.35కి 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళామాత వంటశాలను ప్రారంభించనున్నారు. తర్వాత తిరిగి విజయవాడకు చేరుకుంటారు.
గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ.. విషయం ఇదే..!
సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు.. అయితే, ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు.
కొండా సురేఖ మాటలకు అమెరికాలో పరువు నష్టం దావా వేస్తారు..
ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారని మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి, పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు చట్టవిరుద్ధం అని అన్నారు. ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారన్నారు. రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేస్తే ఆయన పార్లమెంటు సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోల్చితే కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చి డీజీపీ ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడు సారీ చెప్తే.. హత్య చేసి సారీ చెప్పినట్టుగా ఉందన్నారు. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా? అని అన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నా అన్నారు. లేదా తక్షణమే ఆమెను తొలగిస్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువై నేతలు ఇలా వ్యవహరిస్తున్నారు. కళ్ళు నెత్తిమీద ఉన్నాయని తెలిపారు.
ఇక చాలు ఆపండి.. సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ విజ్ఞప్తి..
సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించాలని కోరారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా తను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇరువైపులా మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందని పీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలల్లో దుమారం రేపుతున్నాయి. నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మంత్రిపై విమర్శలతో ముంచెత్తింది. అధికారంతో అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అనేది సదరు మంత్రి ఆలోచించుకోవాలని మండిపడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటుడు శివ కృష్ణ కుమారుడు చేరారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి లు రాజకీయాలను దిగజార్చారని కీలక వ్యాఖ్యలు చేశారఒకటిన్నర నెలల పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల పనిలో ఉన్నానని తెలిపారు. ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు. పేదల కోసం చేసింది ఏమీలేదు ఈ ప్రభుత్వం అన్నారు. పేదల పై కన్నేసి వాళ్ళ ఇళ్లను కూల్చి వేయడం అత్యంత దారుణమని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చవద్దని చెప్పానని అన్నారు. సీఎం కి విధ్వంసాన్ని, కూల్చివేతలు ఆపాలని లేఖ రాశానని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు… బ్యూటిఫికేషన్ అన్నాడని గుర్తుచేశారు. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బీజం వేసిందన్నారు.
జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని పిల్.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కుల ప్రాతిపదికన పనిని విభజించడం ద్వారా జైలు మాన్యువల్ నేరుగా వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కింది కులాల ఖైదీలకు మాత్రమే శుభ్రపరిచే పని, అగ్రవర్ణ ఖైదీలకు వంట పనులు ఇవ్వడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. జైళ్లలో కుల వివక్షను ప్రోత్సహించే జైలు మాన్యువల్‌లోని నిబంధనలను మార్చాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కుల ప్రాతిపదికన జైళ్లలో పనులు పంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కులం ఆధారంగా పని అప్పగించకూడదు. జైలు నిబంధనలలో స్పష్టమైన వివక్ష ఉందని కోర్టు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే క్లీనింగ్ పనులు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. అదేవిధంగా ఇతర కులాల ఖైదీలకు ఆహారం వండుకునే పని కల్పించారని మండిపడింది. జైలు మాన్యువల్‌లోని ఖైదీల కులానికి సంబంధించిన వివరాల వంటి సూచనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీనితో పాటు, శిక్ష పడిన లేదా అండర్ ట్రయల్ ఖైదీల రిజిస్టర్ నుండి కుల కాలమ్‌ను తొలగించాలి. జైళ్లలో కుల వివక్షపై సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా నివేదికలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా మారిన ముస్లిం దేశం.. మండిపడుతున్న ప్రజలు
మంగళవారం అర్థరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, మొసాద్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించారు. చాలా క్షిపణులను కూల్చివేయడంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ విజయం సాధించింది. ఇందులో జోర్డాన్‌తో పాటు అమెరికా నుంచి ఇజ్రాయెల్ సాయం పొందినట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన 180 క్షిపణుల్లో డజనుకు పైగా క్షిపణులను జోర్డాన్ అడ్డగించినట్లు సమాచారు. అనేక క్షిపణులు, డ్రోన్‌లను అడ్డగించినట్లు జోర్డాన్ అధికారులు చెప్పారు. అయితే, ఇరాన్ క్షిపణిని ఆపడం ద్వారా ఇజ్రాయెల్‌కు సహాయం చేసినందుకు ముస్లిం మెజారిటీ దేశం జోర్డాన్ ప్రభుత్వం, సైన్యం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణులను తమ బలగాలు కూల్చివేసినట్లు జోర్డాన్ ప్రభుత్వం ధృవీకరించిందని మిడిల్ ఈస్ట్ ఐ నివేదించింది. మంగళవారం చివరలో ఒక ప్రకటనలో, జోర్డాన్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ దాని వైమానిక రక్షణ క్షిపణులను, డ్రోన్‌లను ఇజ్రాయెల్ వైపుకు వెళ్లకుండా అడ్డగించిందని తెలిపింది. ఈ ప్రకటన రాగానే ప్రభుత్వంపైనా, సైన్యంపైనా విమర్శలు మొదలయ్యాయి. తమ గగనతలంలోకి ప్రవేశించిన అనేక క్షిపణులు, డ్రోన్‌లకు దేశ వైమానిక దళం, వైమానిక రక్షణ వ్యవస్థలు ప్రతిస్పందించాయని జోర్డాన్ అధికారులు చెప్పారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ శివార్లలోని రోడ్డుపై ఇరాన్ క్షిపణి పడిపోవడాన్ని స్థానిక మీడియా కూడా చూపించింది. ఇది ఆత్మరక్షణకు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని జోర్డాన్ అధికారులు చెబుతున్నారు.
దిగ్గజ ఆటగాళ్లు సాధించలేని రికార్డును సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ!
అరంగేట్ర సిరీస్ లోనే ఇంగ్లాండ్ ఆటగాళ్ల గుండెల్లో భయం సృష్టించిన సర్ఫరాజ్., ఇప్పుడు ఇరానీ కప్‌లో తెగ పరుగులు చేస్తున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇరానీ కప్‌లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా సాధించలేని ఈ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ సృష్టించాడు. ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ 2024 ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ముంబై మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫైనల్ రెండో రోజున సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. విశేషమేమిటంటే.. ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తొందరగానే ఔటైన తర్వాత అజింక్య రహానేతో కలిసి సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రహానే తన డిఫెన్సివ్ స్టైల్‌లో ఆడుతుండగా, సర్ఫరాజ్ మరో ఎండ్ నుంచి దూకుడు ప్రదర్శించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దసరా నాడు ‘దసరా దర్శకుడి’తో నేచురల్ స్టార్ సినిమా లాంఛ్
నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దసరా డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను తెచ్చిపెటింది. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో అదే దర్శకుడితో రెండో సారి వీరి కాంబోలో మరో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. నాని కెరీర్‌లో 33వ సినిమాగా రానున్న ఈ సినిమాను నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి భారీ సెట్స్ వేశారు మేకర్స్. మాస్ యాక్షన్ లో రానున్నఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది. నాని, అనిరుధ్ కాంబోలో గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు హిట్ ఆల్బమ్స్ అందించాడు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కనున్న ‘హిట్: ది థర్డ్ కేస్’ లో నటిస్తున్నాడు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని, తాజాగా శ్రీనిధి షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను షేర్ చేశారు. HIT 3ని మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..?
అక్కినేని కుటుంబంపై వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలు, ఇటు టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపాయి. టాలీవుడ్ నటీనటులు ఒక్కతాటిపైకి వచ్చి ఈ విషయన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ ఇలాంటి చవకబారు మాట్లాడితే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో మంత్రిపై ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని అంత సులువుగా నాగార్జున వదిలిపెట్టారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున వైజాగ్‌లో ఉన్నారు, బీజేపీ నేత మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లారు నాగార్జున. హైదరాబాద్ వచ్చాక చట్టపరంగా నాగార్జున నోటీసులు పంపనున్నట్టు సమాచారం. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చట్టపరంగా పోరాడతరని తెలిసింది. ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టాడు. RGV మాట్లడుతూ ” కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి..? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ చైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి.