AP Excise Department: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వల్ల ఏ ఇబ్బంది లేకుండా దరఖాస్తుల స్వీకరణ చేపట్టాం అని ఎన్టీవీతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ నీషాంత్ కుమార్ అన్నారు. ఒకే లాగిన్ నుంచి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో టెక్నికల్ టీం ద్వారా పరివేక్షణ జరుపుతున్నాం.. 99 రూపాయలకు ప్రభుత్వం చెప్పిన విధంగా క్వార్టర్ బాటిల్ అందించటానికి చర్యలు చేపట్టాం.. నాణ్యమైన మద్యం గుర్తింపు పొందిన సంస్థల నుంచి అమ్మకాలు జరిపిస్తామన్నారు. ఈ నెల 11న దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా షాప్స్ కేటాయిస్తాం.. 12వ తేదీ నుంచి షాప్స్ అందుబాటులోకి వస్తాయి.. 3 విధాలుగా దరఖాస్తు చేసుకోవటానికి ఏర్పాట్లు చేశాం అని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నీషాంత్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇదే చివరి టూర్.. మాజీ క్రికెటర్ జోస్యం
ఇక, అధికారులతో, మధ్యవర్తులతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఈ ప్రక్రియ చెరిగేలా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది అని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నీషాంత్ కుమార్ ఎన్టీవీతో చెప్పారు. అన్ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు నేరుగా ఇవ్వొచ్చు.. షాపింగ్ చేసిన మాదిరిగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.. 6 రాష్ట్రాల్లో పరిశీలన జరిపి ఈ పాలసీని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసింది.. 2025 ఆగస్టు వరకు బార్స్ కి లైసెన్స్ ఉంది కాబట్టి అప్పటి వరకు వాటి విషయంలో ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని నీషాంత్ కుమార్ చెప్పారు.