Minister Savita: అమరావతిలో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీడ్ పథకం అమలు చేస్తున్నామన్నామని తెలిపారు. ఏపీలో ఇప్పటికే 6 జిల్లాలో సీడ్ పథకం అమలు చేస్తున్నాం.. త్వరలో మిగిలిన 20 జిల్లాలో అమలు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక, సీడ్ పథకం కింద బీసీ- ఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయం తీసుకుంటాం.. అలాగే, 100 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
Read Also: Prince: హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య.. నా వంతు ప్రయత్నంగా ‘కలి’ సినిమా!
ఇక, బీసీ హాస్టళ్లను తరుచూ విజిట్ చేయాలని జిల్లా అధికారులకు మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని అన్నారు. ఇక, బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే, బీసీ కులాల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా వారికి ఆర్థిక చేయూత అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేలా ఈ ప్రభుత్వం చర్యల తీసుకుంటుందని చెప్పారు.