వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.. ఓవైపు సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది.. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ కానున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్‌ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది.
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీలో నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని యంత్రాంగాన్ని సిద్దం చేయాలని శుక్రవారం కమీషనరేట్ నుండి నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. వరద సాయం నిమిత్తం రూ.20 కోట్లను రిలయన్స్ కంపెనీ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు.
తిరుమలకు జగన్ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్‌కు ఏ సాకులు ఉన్నాయో తెలియదన్నారు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనన్నారు.