Hindupuram: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల వేమారెడ్డికి భార్య నీలపు బాల గట్టి షాక్ ఇచ్చింది. భీమవరంలో పెళ్లయ్యాక తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు అతడు. అయితే, పెళ్లి అయినా తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత భర్తతో కాపురం చేయడానికి నిరాకరించిన బాల.. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం తీసుకెళ్లాలని భర్తతో పోరు పెట్టుకుంది.
Read Also: Tollywood : కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్.. మహేష్, దేవరకొండ ఏమన్నారంటే?
అయితే, తీరా ఆమెను తీస్కోని ట్రైన్ ఎక్కిన అతడికి మరో షాక్ ఇచ్చింది నీలపు బాల. తాను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని.. రైల్వే స్టేషన్ లో దిగగానే సదరు భర్త వేమారెడ్డికి మస్కా కొట్టి ఉడాయించింది. వెంటనే ఆమెకు పలుమార్లు భర్త ఫోన్ చేయగా స్విచ్ఛాప్ రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. తనను మోసగించిన భార్యతో పాటు మ్యారేజ్ బ్రోకర్ పై హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు వేమారెడ్డి మాట్లాడుతూ.. భీమవరం తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య బాల బెదిరించిందని చెప్పాడు. తమ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని చెప్పిందని.. భీమవరం రైల్వే స్టేషన్ లో దిగగానే నన్ను వెనక్కి పంపించేసిందని వాపోయాడు. పెళ్లి విషయంలో మోసం చేసిన వాళ్లే నన్ను బెదిరించారు అని భర్త వేమారెడ్డి వెల్లడించారు.