కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు దగ్గర నుంచి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతాం అని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నాం.. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం.
ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
Velampalli Srinivas: ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు.. తప్పు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు.
TG Venkatesh: ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరు జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన మూడు వారాలుగా చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు పలుకుతుంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. అమ్మకాలు తగ్గినా చికెన్ కు భారీగా డిమాండ్ పెరిగింది.
Alla Nani: ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల సార్వత్రిక ఎన్ని కల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైసీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి శాంతినగర్ కు చెందిన అవుటుపల్లి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు.
Prices: దసరా, దీపావళి పండగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు అంటున్నారు.