New Registration Charges: ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి.. ఈ మేరకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది.. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త భూమి విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ప్రసుత్తం ఉన్న దానిపై 10 శాతం నుంచి 15 శాతం వరకు భూమి విలువలు పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జనవరి ఫస్ట్ నుంచి ల్యాండ్ రేట్స్ రివిజన్ జరుగుతుందనేది వాస్తవం కాదని స్పష్టం చేశారు. గ్రోత్ కారిడార్లు వున్న దగ్గర భూముల ధరలు సమీక్షించి అమలు చేయాలనే ఆలోచన ఉందని.. మార్కెట్ ధరల కంటే ప్రభుత్వ ధరలు ఎక్కువగా వున్న చోట సమీక్షిస్తామని.. గిఫ్ట్ డీఢ్ రిజిస్ట్రేషన్ ధరలను కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నాం అన్నారు.
Read Also: Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!
ఇక, వైసీపీ ప్రభుత్వం హయంలో భూమికి కూడా చెదలు పట్టించింది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అనగాని.. రీ సర్వేను లోప భూయిష్టంగా మార్చేసి అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష 40వేల గ్రీవెన్స్ వస్తే 90 వేలు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ ల శాఖకు చెందినవే అన్నారు.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం జోనల్ మీటింగ్ లు జరుగుతున్నాయి.. కృష్ణా జిల్లాలో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు… మీ భూమి – మీ హక్కు ద్వారా తమ భూములు తిరిగి దక్కుతాయని నమ్మకం కుదిరిందన్నారు.. ఫ్రీ హోల్డ్ భూముల్లో ఎక్కువ అవకతవకలు జరిగాయి.. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి కేస్ బై కేస్ పరిశీలించి చర్యలు తప్పవు అని హెచ్చరించారు.. అక్రమాలకు పాల్పడిన వాళ్లు రికార్డులు టాంపరింగ్ చేసిన అధికారులు.. ఇలా అందరిపైనా చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.. మరోవైపు, 150 గజాల లోపు భూముల్లో ఇల్లు కట్టుకున్న వాళ్లకు రెగ్యులైజేశన్ చేసే ఆలోచనలు కార్యరూపం దాల్చనుంది.. 22(ఏ) సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోమని కలెక్టర్లకు నిర్దేశించాం.. వైజాగ్ లో 22(ఏ) లో వున్న ఇళ్లు.. బాధితులు నుంచి ఫిర్యాదులు వచ్చాయి.. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్.