Tirumala: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష.. టికెట్లు విడుదల చేసేది ఎప్పుడంటే..?
- వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష..
- 23న వైకుంఠ ద్వార దర్శనాలకు శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్‌లో విడుదల..
- 24న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎస్ఈడీ టికెట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోంది తిరుమల.. ఇక, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్‌లో విడుదల చేస్తాం.. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్‌డీ టోకెన్లు కేటాయిస్తాం అన్నారు.. తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తాం అన్నారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు.
Read Also: Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
అయితే, టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తాం అన్నారు ఈవో శ్యామలరావు.. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు.. కానీ, దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు అని స్పష్టం చేశారు.. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి.. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తాం అన్నారు.. ఇక, గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సూచించారు టీటీడీ ఈవో శ్యామలరావు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!