Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడడం లేదనే చెప్పాలి.. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు.. వాటి ప్రభావంతో.. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మొన్నటి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా.. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. అలప్పీడనం ఎఫెక్ట్ తో వచ్చే నాలుగు రోజులపాటు కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని.. రేపు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, కృష్ణ జిల్లా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. తీరం వెంబడి 35 -45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.. మరోవైపు.. దక్షిణ కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు వేట నిషేధించినట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Read Also: Shruti Haasan: శృతి హాసన్ తప్పుకుంటుందా? తప్పిస్తున్నారా?