Minister Atchannaidu: పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. జిల్లా సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో జనవరి నెలాఖరులోపు చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలకు ఆదేశించారు.. ఇక, రాష్ట్రంలో ఎమ్బ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వృద్ధి చేసి మేలైన పశు జాతులను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ఇక, పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. పశువుల ఆసుపత్రి భవనాల నిర్మాణాలు, మరమ్మతులు అవసరం ఉన్నవి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక, ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించేందుకు నివేదిక పంపాలని ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు.
Read Also: Jagadish Reddy: దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలి..