Minister Payyavula Keshav: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. పయ్యావుల కేశవ్ వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.. రాష్ట్ర బడ్జెట్ ను ఇటీవలే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే కాగా.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి నిర్మల సీతారామన్ ను కలిశారు పయ్యావుల కేశవ్.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు..
Read Also: Prabhas’ Fauji: ఫౌజి కోసం ఊహించని రిస్క్
కాగా, గత నెలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే.. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందు పెట్టారు.. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లుగా ఉండగా.. మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొంది ప్రభుత్వం.. ఇక, రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..

