కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12ఏళ్ల చిన్నారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలియరాని కారణాలతో బాలుడు సాయి హర్ష ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లి ఉద్యోగ విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పారిశ్రామికవాడలో పర్యటించిన మంత్రి.. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
కృష్ణా జిల్లా పెడనలో సాగునీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెడనలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పెడన మండలం నందిగామ గ్రామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్పై కత్తితో దాడి చేశారు.
మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.. మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుధ.. అయితే, పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన విషయం విదితమే.. రేషన్ బియ్యం అక్రమాలపై అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
రాజధాని అమరావతితో హైవేల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాంగా రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. అమరావతితో హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్లను పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. హైవే నుంచి అమరావతికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అనుమతులపై మంత్రికి వివరించారు అధికారులు.
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.