Manchu Mohan Babu: మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట
- మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట..
- పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు..
- శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కూడా మీడియాపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Mohan Babu: ఓవైపు కుటుంబ వ్యవహారాలు.. మరోవైపు కేసులతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు సతమతం అవుతున్నారు.. హైదరాబాద్ జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు.. ఇక, మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కూడా మీడియాపై దాడి జరిగిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట దక్కింది.. పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు.. ఈ నెల 9వ తేదీన మోహన్‌బాబు యూనివర్సిటీ ఎదుట న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టుల పై దాడి జరగగా.. జర్నలిస్టుల ఫిర్యాదుతో పీఆర్వో సతీష్ తో పాటు మరికొందరి పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు వారికి ఊరట కలిగిస్తూ స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు..
Read Also: Manipur: మణిపూర్లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..
Also Read
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?