Earthquake: ప్రకాశం జిల్లా వాసులును ఇవాళ సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు టెన్షన్ పెట్టాయి.. గతంలో దర్శి, అద్దంకి, ఒంగోలు ప్రాంతాల్లో తరచూ సంభవించే భూ ప్రకంపనలు ఇటీవలి కాలంలో కనిపించక పోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.. తాజాగా ఇవాళ తాళ్ళూరు, ముండ్లమూరు, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.. ముండ్లమూరు మండలం లోని వేంపాడు, పసుపుగల్లు, తాళ్లూరు మండలం లోని రామభద్రాపురం, కొత్తపాలెం, కురిచేడులలో ఉదయం 10:40 సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ళ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సైతం బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల ఇళ్ళలో ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. పలు దుకానాల్లో వస్తువులు కింద పడిపోయాయి.. ఒక్కసారిగా ఏమీ జరుగుతుందో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.. గతంలో పలుమార్లు భూ ప్రకంపనలు చోటుచూసుకున్న సమయంలో జిల్లా కేంద్రంలో రిక్టర్ స్కేలును ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించినా ఆ తర్వాత తగ్గుముఖం పట్టడటంతో అధికారులు పట్టించుకోలేదు.. తాజా భూ ప్రకంపనల నేపథ్యంలో రిక్టర్ స్కేలును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు…
Read Also: Game Changer : నేడు గేమ్ ఛేంజర్ ‘డోప్’ సాంగ్ రిలీజ్.. ఏ టైంకు వస్తుందంటే ?