YS Jagan Birthday: అలియాస్ యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి.. అలియాస్ వైఎస్ జగన్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి.. ఆయన పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. 1972 డిసెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించిన జగన్.. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 మే నెలలో తొలిసారిగా కడప లోక్‌సభ నియోజకవర్గం బరిలోకి దిగి విజయం సాధించారు.. ఇక, 2009లో వైఎస్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత ఓదార్పు యాత్ర చేపట్టడం.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఏర్పడి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)ని స్థాపించాడు.. 2014 ఎన్నికల్లో 67 స్థానాలను సాధించి శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నర ఆయన.. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు.. ఇక, తాజా ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే. కానీ, కూటమి సర్కార్‌కు ఎక్కువ సమయం ఇవ్వకుండా.. వెంటనే ప్రజా సమస్యలపై పోరాటాలు ప్రారంభించారు.. క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ రోజు తమ అభిమాన నేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. ఆయన అభిమానులు..
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. అనంతరం ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పార్టీ నేతలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. కార్యక్రమానికి మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు.. పార్టీని ప్రారంభించిన పదేళ్లలోనే ఓ విజనరీగా తాను అనుకున్నది ప్రజలకు చేసి చూపించిన నేత వైఎస్ జగన్ అని ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. లక్షలాది మంది ప్రజలకు ఆయన ఓ గుండె ధైర్యమన్నారు. ఆయన విలువలకు కట్టుబడిన నేత అని.. మాటకు కట్టుబడే నేతగా ఉన్నాడు కాబట్టే ప్రజలు ఆయనకు పట్టం కట్టారన్నారు. సీఎంగా పని చేసిన సమయంలో 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత దేశంలోనే ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు.. వైసీపీ ప్రభుత్వ హాయంలో పేదల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఐదేళ్ల జగన్ పాలన, ఆరు నెలల కూటమి పాలన తేడా అర్థమవుతోందన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడే వ్యక్తి జగన్ అన్నారు. విజన్ అంటే 30 ఏళ్ళ తర్వాత మనం ఉంటామో లేదో తెలియని వరకు చేసేది కాదని.. మనం పరిపాలన చేసే సమయంలో ఓ విజన్ తో పనిచేయాలని చేసి చూపిన నేత జగన్ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
* చిత్తూరులో మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ జన్మదినం సందర్భంగా వైసిపి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.. నియోజకవర్గం సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు.. నగరి టవర్ క్లాక్ కూడలిలో కేక్ కట్ చేసి అన్నదానం చేపట్టారు మాజీ మంత్రి రోజా..
* జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరులోని వైసిపి జిల్లా కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించాయి పార్టీ శ్రేణులు.. వైసిపి పార్లమెంటరీ సమన్వయకర్త కర్త మోదుగుల వేణుగోపాల్ రెడ్డి…తదితర నాయకులు హాజరయ్యారు.
* కడపలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సిఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి.. హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.. డప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం ఆంజధ్ భాషా, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.
* గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైయస్ జగన్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తదితర నాయకులు పాల్గొన్నారు.
* కడప జిల్లా పోరుమామిళ్ల వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పాల్గొని.. జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు..
* ఒంగోలు వైసిపి కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ, పలువురు వైసీపీ నేతలు
* బెజవాడలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి.. కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేసిన వైసిపి శ్రేణులు.. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.. అనేక సేవా కార్యక్రమాలు చేసి జగన్ పై ప్రజలు అభిమానం చాటుకున్నారు.. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఆన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు.. జగన్ లేకపోతే రాష్ట్రం ఎలాగ ఉంటుందో ఇప్పుడు ప్రజలు చూశారని పేర్కొన్నారు దేవినేని అవినాష్.
* ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.. కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు.. రాష్ట్ర ప్రజల అభిమానం, ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి కి తోడుగా ఉంటాయన్న మాజీ మంత్రి.. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
* గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. పదవుల వల్ల నాయకులకి గౌరవం రావడం కాదు… నాయకుడు వల్ల పదవికి గౌరవం రావాలి … అలా పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, ప్రజలతో మమేకమై ఉంటుంది.. రాజశేఖర్ రెడ్డి మరణించి 15 సంవత్సరాలు అవుతున్న ప్రజల గుండెల్లో అతని ముద్ర చెరిపేయ లేకపోయారు.. అలాగే ప్రజల గుండెల్లో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.
* నెల్లూరు సిటీ వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పార్టీ నేతలు ..కార్యకర్తలు పాల్గొని.. రక్తదానం చేశారు.. ఇక, కావలిలో జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన మాజీ ఎం.ఎల్.ఏ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి…
* తిరుపతిలోని టిఎం ఆర్ కల్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.. మాజీ మంత్రి రోజా, ఎంపీ గురుమూర్తి, పార్టీ నేతలు ..కార్యకర్తలు పాల్గొన్నారు.. జగన్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేశారు కార్యకర్తలు..
* లక్షలాది మంది ప్రజలకు జగన్ ఓ గుండె ధైర్యం.. విలువలకు కట్టుబడిన నేత జగన్.. పదేళ్లలో ఓ విజనరీగా తాను అనుకున్నది ప్రజలకు చేసి చూపించాడు.. మాటకు కట్టుబడే నేతగా ఉన్నాడు కాబట్టే ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.. సీఎంగా పని చేసిన సమయంలో 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాని ప్రశంసలు కురిపించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడే వ్యక్తి జగన్ అని తెలిపారు.
* నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసిపి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి.. కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు..
* ఆటు పొట్ల ను ధైర్యం గా ఎదుర్కొగల ధీరుడు జగన్ … కొంత మంది పార్టీ పెట్టీ విలీనం చేయడం ,పొత్తులు పెట్టుకోవడం చేస్తుంటారు… కానీ జగన్ పార్టీ పెట్టీ ధైర్యం గా పోరాడాడు.. ఒక్క సీటు ఉన్నా, 65 సీట్లు వచ్చినా ,ఇప్పుడు 11 సీట్లు వచ్చినా భయపడే రకం కాదు అని పేర్కొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
* కడప జిల్లా పులివెందులలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.. పులివెందులలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జగన్ జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి పలువురికి మిఠాయిలు పంచిపెట్టిన ఎంపీ అవినాష్ రెడ్డి.. అనంతరం మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
* ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డి ను చూస్తే భయపడ్డారు, ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూస్తే కూటమి నాయకులకు భయం పట్టుకుంది.. ఓట్లు కోసం
కాళ్ళు, చేతులు పట్టుకున్నారు…. ఇప్పుడు వదిలేశారని పేర్కొన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా.
* కర్నూలు: మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి 300 ప్లాస్టిక్ ఛైర్స్ విరాళంగా ఇచ్చింది బుట్టా ఫౌండేషన్.