ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి అధికారులు ఇచ్చిన యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలు నిర్దేశించారు.. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ -1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ -2తో పాటు మిగతాపనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ.. జులై నాటికే వాటిని పూర్తి చేయాలని లక్ష్యాన్ని…
ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు.. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు... ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. చంద్రబాబు రాగానే ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి అన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
రేపు గుంటూరు జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో.. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికార యంత్రాంగం... మంగళగిరి AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనడం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
మరోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత వైసీపీ ప్రభుత్వం వల్లే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు... ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లుగా భావించామన్న ఆయన.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి.. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందని వెల్లడించారు.
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.