ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను ఆవిష్కరించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో.. ఈ కొత్త పాలసీని విడుదల చేశారు.. ఇక, నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో చర్చించి ఆహ్వానించారు మంత్రి దుర్గేష్.. అంతేకాదు.. పెట్టుబడిదారుల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు
మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని.
మంగళగిరి ఎయిమ్స్కు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామని తెలిపారు.. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజు (డిసెంబర్ 17) జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
మంచు మనోజ్ , మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్ళి తర్వాత వారిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశం అవుతోంది. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లి దండ్రులకు నివాళులు అర్పించేందుకు వచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని, అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం మిగిలిన 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతిచ్చేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. ఆన్లైన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చేందుకు ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. మార్చి నెలకు సంబంధించిన వివిధ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..
అమరావతిలో లే ఔట్లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ.. ఇవాళ 24,276.83 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు అనుమతులిచ్చింది.. మొత్తం ఖర్చు 62 వేల కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకూ 45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..