RK Roja Open Challenge: ప్రభుత్వానికి రోజా సవాల్.. నేను చేసిన అవినీతి ఏంటి..?
- కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా బహిరంగ సవాల్..
- నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్..
- ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja Open Challenge: తిరుపతి నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డి ను చూస్తే భయపడ్డారు, ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.. ఓట్లు కోసం కాళ్ళు, చేతులు పట్టుకున్నారు… ఇప్పుడు వదిలేశారన్న ఆమె.. ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లే.. ఈ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.. అధికారంలో ఉన్న కూటమీ ప్రభుత్వంపై నెల రోజులకే వ్యతిరేకత మొదలైంది.. జగన్ అన్న నాయకత్వంలో జగన్ అన్నకు తోడుగా, అండగా ప్రజలు పక్షాన పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.. రాబోయే ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని సూచించారు.. కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నా, మా పార్టీ నాయకుల ఆస్తులు కూలదోచినా, వేధించినా, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఆర్.కే.రోజా, సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష..
Read Also: Effect On Male Fertility: మగాళ్లు జాగ్రత్త.. ఇలా చేస్తే మీ సంతానోత్పత్తిపై తీవ్ర సమస్యలు తలెత్తుతాయి
Also Read
- Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
- TTD Employees: టీటీడీలో బైబిల్స్ పంపిణీ.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!
- AP News: రౌడీ షీటర్ పప్పు రాయల్‌ను చావబాదిన క్రికెట్ ప్లేయర్స్!
- Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం!
ఇక, కూటమి ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.. కులం, మతం లేకుండా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు.. అబద్దాపు హామీలు ఇచ్చి కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.. మళ్లీ ఏపీ ప్రజలు ఎప్పుడప్పుడు జగన్ సీఎం అవుతారా? అని ఎదురుచూస్తున్నారు.. బాబు షూరిటీ అని చెప్పి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. కరెంట్ చార్జీలు, నిత్యావసర ధరలు పెంచారు.. తిరుపతిలో పబ్ లు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ జగన్ కటౌట్ చూస్తూ కూడా కూటమీ నేతలు భయపడుతున్నారు.. అధికారులను అడ్డం పెట్టుకుని పుట్టిన రోజు వేడుకలను అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!