Free Bus Scheme in AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొన్నింటిని వరుసగా అమలు చేస్తూ వస్తోంది.. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. గతంలోనే.. ఈ పథకం అమలు చేస్తారనే ప్రచారం జరిగినా.. అది కార్యరూపం దాల్చలేదు.. అయితే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్‌గా.. హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం..
Read Also: Telangana Assembly 2024 LIVE: నేడు 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
ఇక, ఈ కమిటీ కన్వీనర్ గా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని నియమించింది.. కమిటీ సమావేశాలు నిర్వహించడం, కమిటీ ఇచ్చే సమాచారం పొందుపరచడం వంటి బాధ్యలను కన్వీనర్‌కు అప్పగించింది.. సాధ్యమైనంత త్వరగా సదరు రాష్ట్రాల్లో పర్యటనలు ముగించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఇక, వచ్చే నెల అంటే 2025 జనవరి 2వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణాలు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..