Heavy Rains in AP: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంగా.. మూడు రోజుల పాటు.. అంటే గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు.. ఇక, అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది..
Read Also: Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ
అయితే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16వ తేదీన అల్పపీడనం ఏర్పడిన విషయం విదితమే కాగా.. తర్వాత వాయుగుండంగా బలపడి, తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. కానీ, రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చింది. ఆ తర్వాత మరో రెండు రోజులకు వాయుగుండంగా మారిపోయింది.. అయితే, అల్పపీడనం ఏపీపై మరో మూడు రోజులు ఉంటుందని వాతావరణశాఖ పేర్కొన్న విషయం విదితమే కాగా.. ముఖ్యంగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు. వైయస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.