Central Minister Rammohan Naidu: శరవేగంగా పనులు జరుగుతున్నాయి.. జూన్ 2026కే భోగాపురం ఎయిర్‌పోర్ట పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని తిరుమల కాలేజ్ లో కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 35 వేల మంది ఉన్న తిరుమల కాలేజ్ లో 627 మంది ఐఐటీ, నీట్, బిట్స్ లో పట్టాలు పొందడం అభినందనీయం అన్నారు.. సాధారణ కుటుంబాల నుండి తిరుమలకు వచ్చి సీట్లు సంపాదిస్తున్నారని తెలిపారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువతపై, విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.. విద్యాశాఖ మంత్రిగా యువకుడిగా నారా లోకేష్ చాలెంజ్‌గా తీసుకున్నారన్నారు.. అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగువారు వివిధ హోదాల్లో రాణిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు..
Read Also: One Nation-One Election: “ఒకే దేశం ఒకే ఎన్నిక”పై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదల..
ఇక, కొత్తగా ఎయిర్‌పోర్ట ఏర్పాటు విషయంలో.. కాకినాడ ఇతర ప్రాంతాల్లో అనువుగా ఉన్న ప్రాంతాన్ని చూస్తున్నట్టు వెల్లడించారు రామ్మోహన్‌నాయుడు.. భోగాపురం అద్భుతమైన ప్రాజెక్టుగా పేర్కొన్న ఆయన.. శరవేగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నాం అన్నారు.. జూన్ 2026 కే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయని పూర్తి చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు.. విశాఖ ఎయిర్‌పోర్ట నుంచి అన్ని విభాగాల తరలింపు కూడా వేగవంతం చేస్తు్న్నామని వెల్లడించారు కేద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు..