Deputy CM Pawan Kalyan: క్షేత్రస్థాయిలో పవన్ కల్యాణ్ పర్యటన.. రోడ్డు తవ్వి మరీ నాణ్యత పరిశీలన..!
- కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
- కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన..
- గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో..
- రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించిన పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు బిజీ బిజీగా గడిపారు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధిశాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.. పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం, కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు పవన్ కల్యాణ్.. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్ళే రహదారిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పనుల నాణ్యత పర్యవేక్షణ చేశారు.
Read Also: Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!
Also Read
- Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ఇక, గుడివాడ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రూరల్ మండలం మల్లాయపాలెం వాటర్ వర్క్స్ వద్ద పవన్ కు స్వాగతం పలికారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమినేతలు… మల్లాయపాలెం త్రాగునీటి చెరువు.. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్.. ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేయు విధానాన్ని.. పవన్ కు వివరించారు కలెక్టర్ బాలాజీ.. గ్రామీణ ప్రాంతాల్లో నిటి సరఫరా వ్యవస్థ ఫోటో ప్రదర్శన తిలకించారు.. నీటి శుద్ధి పరీక్షలను వీక్షించారు.. ఇటీవల పవన్ కల్యాణ్ చొరవతో విడుదలైన రూ.2.27 కోట్లతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మరమ్మత్తులు చేసిన ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ప్రజలు.. అభిమానులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు.. అభిమానులకు అభివాదాలు చేస్తూ.. మంగళగిరి తిరుగు ప్రయాణమయ్యారు పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!