CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకే 34 శాతం.. సీఎం కీలక వ్యాఖ్యలు..
- బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష..
- నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు..
- దీనిపై త్వరలో చట్టబద్ధత తెస్తామన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా లబ్ధి జరిగేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరికొంత కసరత్తు తరువాత…సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని….దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని సీఎం తెలిపారు. దీనిపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్లేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారన్నారు. వీటిని పునరుద్ధరించేందుకు న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై సీఎం సమీక్షలో చర్చించారు. న్యాయపరంగా తిరిగి 34 శాతం రిజర్వేషన్లు పొందడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కోర్టు తీర్పులు పరిశీలించి…..న్యాయ పరంగా ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు.
Read Also: Bengaluru: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.11.8 కోట్లు మాయం
Also Read
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలికల హాస్టళ్లు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 11 వందలకు పైగా బీసీ విద్యార్థుల హాస్టళ్లు ఉన్నాయి.ప్రభుత్వ భవనాలు 660 ఉండగా, అద్దె భవనాలు 450 ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన రూ.110.52 కోట్ల డైట్ బిల్లుల్లో రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించగా రూ.34.14 కోట్లు పెండింగులో ఉన్నాయి…వాటిని కూడా చెల్లించాలని ఆదేశించారు. 2024-25 సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.135 కోట్లు కేటాయించింది. ఆగస్టు నాటికి కాస్మోటిక్ బిల్లులు కూడా రూ.20 కోట్లు పెండింగులో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించిందని సీఎం తెలిపారు.. విద్యార్థుల ట్రంక్ బాక్సులు, ఇతర వస్తువులకుగాను ప్రభుత్వం బడ్జెట్ లో రూ.18 కోట్లు కేటాయించింది. వీటిని త్వరలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు…డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల చెల్లింపు, ట్యూటర్ ఫీజు, హాస్టళ్ల మైనర్ రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు.
Read Also: FACT CHECK: “మద్యం తాగి రాజ్యాంగం రాశారు”.. కేజ్రీవాల్ వీడియో వైరల్
13 బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసింది. 5 వేల720 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించింది ప్రభుత్వం. త్వరలోనే ఆన్ లైన్ తరగతులు కూడా చేపట్టనున్నారు. సివిల్స్ కు ఏటా 100 మందికి శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సర్కిల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో 5 ఎకరాలను సివిల్ సర్వీస్ కోచింగ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. దీని కోసం ఇప్పటికే భవనానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం కాగా..500 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. 2014-19 మధ్య విదేశాల్లో చదువుకున్న బీసీ విద్యార్థులకు రూ.81.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం నిధులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. వీటి కోసం 2024-25 బడ్జెట్ లో రూ.36.11 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి జిల్లాల్లో 13 బీసీ భవనాల నిర్మాణాలకు 2016-17లో నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో భవనం పూర్తికి రూ.5 కోట్లు ఖర్చు కానుండగా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో రూ.10 కోట్లు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నట్లు సమీక్షలో చర్చించారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు బీసి భవనాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మిగిలిన భవనాల నిర్మాణానికి ఇతర జిల్లాల్లో భూసేకరణ పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి చెప్పారు. బీసీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బడ్జెట్ లో రూ.896.79 కోట్లు కేటాయిచింది. రుణాల మంజూరుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గొర్రెల పెంపకం దారులకు అందించాల్సిన చేయూతపైనా సమీక్షలో చర్చ జరిగింది. అదే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం లో 13 జిల్లాల్లో కాపు భవన్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ. 2 కోట్ల చొప్పున కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే వీటిలో 4 భవనాల నిర్మాణం ప్రారంభం కాగా గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. నిలిచిపోయిన 4 కాపు భవనాలను కూడా పూర్తి చేసేందుకు అవసరమైన రూ.5.40 కోట్ల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్‌సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!