MLA vs Mayor: కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు.. సమావేశం నుంచి మేయర్ సురేష్ బాబు బయటకు వెళ్లిపోయారు.. సమావేశంలో ఉదయం నుంచి సీటు ఫైట్ కొనసాగింది.. మేయర్ సీటు పక్కనే తనకు కూడా సీటు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే మాధవి డిమాండ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల ఘర్షణతో కార్పొరేషన్‌లో ఆందరగోళ పరిస్థితి నెలకొంది.. మధ్యాహ్నం తర్వత కూడా సమావేశంలో కుర్చీ ఫైట్ కొనసాగడంతో.. వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు..
Read Also: Minister Thummala: బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.. మంత్రి మండిపాటు
ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.. కడప కార్పొరేషన్ సమావేశం ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆమె.. అజెండాపై చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారని దుయ్యబట్టారు.. ఇలాంటి సమావేశానికి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన మేయర్ కు లేదన్నారు.. ఒక నియంతలా వ్యవహరించారు.. ఒక మహిళ ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు. కడప కార్పొరేషన్ రాయించుకున్నట్ల వ్యవహారించారు. వైసీపీ అచ్చోసిన ఆంబోతులా మేయర్‌ను వదిలేసిందని ఫైర్ అయ్యారు. సమావేశంలో వైకాపా కార్పోరేటర్లు హంగామా చేశారు. రోడ్ల విస్తరణలో గుడి తొలిగించి తర్వాత నిర్మించలేదు. గుడి, మసీదు,చర్చి స్థలాలు ఆక్రమించారు. కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక కుర్చీ డ్రామా ఆడుతున్నారని.. ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. అనధికారికంగా మేయర్ కార్పొరేషన్ రాయించుకున్నారు. కనీసం వీధి కుక్కలను అరికట్టలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉందన్నారు.. సమాధానం చెప్పలేక చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేసుకున్నారు. ప్రజా సమస్యలు మేయర్ కు పట్టవు.. మేయర్ కుటుంబ సభ్యులు నిబంధనలు వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి..