CPM AP Conference: నెల్లూరులో రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు..
- రేపటి నుంచి సీపీఎం ఏపీ 27వ రాష్ట్ర మహాసభలు..
- ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు మహాసభలు..
- హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు, అతిథులు..
- 45 ఏళ్ల తర్వాత మహాసభలకు ఆతిథ్యమిస్తోన్న నెల్లూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM AP Conference: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఐ(ఎం).. వరుసగా వివిధ రాష్ట్రాల్లో మహాసభలను నిర్వహిస్తూ.. రాష్ట్ర కార్యదర్శులను ఎన్నుకుంటూ వస్తుంది.. అన్ని రాష్ట్రాల్లో మహాసభలు ముగిసిన తర్వాత జాతీయ మమహాసభలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే తెలంగాణలో మహాసభల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే కాగా… ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. సీపీఎం మహాసభలకు ముస్తాబైంది.. రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు, అతిథులు హజరవుతున్నారు. ఆలిండియా నాయకులు శ్రీమతి బృందాకరత్, ఎంఏ బేబి, బీవీ రాఘవులు, ఆర్.అరుణ్‌కుమార్ తదితరులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మహాసభ ప్రారంభ సభ జరుగుతుందని.. ఆలిండియా నాయకులు, రాష్ట్ర నాయకత్వంతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటారు. ఈ ప్రారంభ సభకు ప్రతినిధులతో పాటు నెల్లూరు ప్రముఖులు కూడా పాల్గొంటారనీ ఓ ప్రటనలో పేర్కొంది సీపీఎం రాష్ట్ర కార్యాలయం..
Read Also: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
ఇక, ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు వీఆర్ హైస్కూలు గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.. ఇక, సీపీఎం మహాసభల ప్రాంగణానికి సీతారామ్ ఏచూరి పేరును ఖరారు చేశారు. నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి పలు అంశాల మీద ఐదు యాత్రలతో ప్రజలు కదిలివస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అయితే, సీపీఎం రాష్ట్ర మహాసభలు 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో జరగనున్నాయి.. దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో నెల్లూరులో 1978లో 13వ రాష్ట్ర మహాసభలు జరగగా.. 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరు సీపీఎం మహాసభలకు ఆతిథ్యమిస్తోంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?