Bandi Saroj Kumar: కేసులేస్తే వాళ్లు ఇంకా పెద్దోళ్లవుతారు.. సినిమా ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Saroj Kumar: తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు జరుగుతున్న ‘రివ్యూ మాఫియా’ చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై నటుడు, దర్శకుడు, రచయిత బండి సరోజ్ కుమార్ ఓ వైరల్ ట్వీట్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రివ్యూయర్లపై డిఫామేషన్ కేసులు వేస్తే.. వాళ్ల ప్లాట్‌ఫాం మరింత పెద్దదవుతుంది. ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు మాట్లాడుతున్నారు. కోర్టు ఆదేశాలతో రేటింగ్స్ బ్లాక్ చేసినా.. ప్రజలు ఇప్పటికే నిజాయితీగా మాట్లాడే పాడ్‌కాస్ట్‌లు, ఛానెళ్ల వైపు వెళ్తున్నారు” అంటూ ఈ ట్వీట్‌లో బండి సరోజ్ స్పష్టంగా చెప్పారు.
READ ALSO: Revenge killing: పదేళ్ల క్రితం లేచిపోగా.. తల్లి మాజీ ప్రియుడిని హత్య చేసిన కొడుకు..
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
ఇటీవల చిరంజీవి సినిమా నుంచి మొదలైన ‘రేటింగ్స్ బ్లాక్’ ఆదేశాలు, ‘రివ్యూ మాఫియా’పై చర్యలు.. ఇవన్నీ జనవరి 2026లోనే జరిగాయి. అయితే ఈ చర్యలు రివ్యూయర్ల గొంతును అణచివేయడమే కాకుండా.. వాళ్లకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నాయని బండి సరోజ్ అభిప్రాయపడ్డారు. పెయిడ్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ ఛానెళ్లను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. “పెయిడ్ జర్నలిస్ట్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ రివ్యూలను పట్టించుకోకండి. ప్రజలు ఇప్పుడు లక్షల వ్యూస్ వచ్చే జెన్యూన్ పాడ్‌కాస్ట్‌లు, డిస్కషన్లను ఇష్టపడుతున్నారు” అని స్పష్టం చేశారు. సినిమా ప్రేక్షకులు ఇప్పుడు నిజాయితీపై ఎక్కువ ఆధారపడుతున్నారని, మానిప్యులేటెడ్ కామెంటరీలపై నమ్మకం తగ్గిపోతోందని చెప్పారు. టికెట్ రేట్లే అసలు సమస్య.. కేసులు కాదని చెప్పారు. “రివ్యూయర్లపై కేసులు వేయడం కంటే.. టికెట్ రేట్లను రెగ్యులేట్ చేయండి. టికెట్ ధరలు పెరిగితే ఫుట్‌ఫాల్స్ తగ్గుతాయి. దీంతో హీరోల రెమ్యూనరేషన్, బాక్సాఫీస్ కలెక్షన్స్ రెండూ దెబ్బతింటాయి” అని హెచ్చరించారు. ప్రభుత్వ జీవోల ద్వారా టికెట్ రేట్లు ఎక్కువ చేయడం వల్ల సినిమా థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారని, దీర్ఘకాలంలో ఇది సినిమా రంగానికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. “టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అప్పుడే అందరి జీతాలూ, సినిమా కలెక్షన్స్ బాగుంటాయి” అని ఆయన చెప్పారు.
కవర్లు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాసే కొంత మంది అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో వెలివేసింది. వీళ్ల రివ్యూలను పక్కన పెట్టండి, ఇంటర్వ్యూలకి కూడా వ్యూస్ రావు. నిన్న మొన్న వచ్చిన podcast కుర్రాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. Because they discuss cinema. అలాగే యూట్యూబ్ లో…
— Bandi Saroj Kumar (@publicstar_bsk) February 4, 2026
READ ALSO: Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!