AP Registration Charges: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేందుకు సిద్ధమైంది.. సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే అమల్లోకి రాబోతున్నాయి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది సర్కార్.. అయితే, రేపటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి..
Read Also: Abhinaya: 15 ఏళ్లుగా అతని ప్రేమిస్తున్నాను..విశాల్ తో లవ్‌ట్రాక్ కి ముగింపు పలికిన అభినయ
రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కొనుగోలుదారుల రద్దీ కొనసాగుతోంది.. విజయనగరం జిల్లా బొబ్బిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచే కొనుగోలుదారులు క్యూ కట్టారు.. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చు తగ్గుతాయని కార్యాలయానికి పెద్ద సంఖ్యలు చేరుకున్నారు.. అయితే, రిజిస్ట్రేషన్ల తాకిడి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా పెరగడంతో.. ఇంటర్‌నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి శనివారం నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖను ఆదేశించింది. భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది..
Read Also: Abhinaya: 15 ఏళ్లుగా అతని ప్రేమిస్తున్నాను..విశాల్ తో లవ్‌ట్రాక్ కి ముగింపు పలికిన అభినయ
ఇక, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయని కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. 10 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కొత్తగా కార్పొరేషన్ లో విలీనమైన శివారు ప్రాంతాల్లో వందశాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచనున్నారు. మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రద్దీ కనిపిస్తోంది.. జిల్లాలో 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది.. జిల్లాలోని పందిపాడు, పెద్దపాడు, లక్ష్మీపురం, ధూపాడులో 100 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి.. మరోవైపు, ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల సర్వర్లు మొరాయించడంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న పరిస్థితులు నెలకొనగా మరికొన్నిచోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి… రేపటి నుండి 10-15 శాతం వరకు రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరుగుతాయని సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.. మరో వైపు పెరిగే రిజిస్ట్రేషన్ల ధరలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi : బడ్జెట్ సమావేశానికి ముందు లక్ష్మీ దేవిని గుర్తు చేసిన ప్రధాని మోదీ
కడప జిల్లాలోనూ రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనంతో నిండిపోయాయి. నిన్న ఒకరోజు దాదాపు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణంగా ప్రతిరోజు జరిగే రిజిస్ట్రేషన్లకు రెండింతలు ఎక్కువ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 15 నుంచి 30 శాతం రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. అన్నమయ్య జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. గురువారం రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు సైతం రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. కడప, రాయచోటి, మదనపల్లె, బద్వేలు ప్రాంతాల్లో భూముల విలువ 30 శాతం వరకు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
గుంటూరు జిల్లాలో కిటకిటలాడుతున్నాయి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు .. రేపటి నుంచి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం క్యూలు కడుతున్న భూ కొనుగోలుదారులు.. కొత్త రేట్లు అమలులోకి వస్తే రిజిస్ట్రేషన్ టాక్స్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఉదయం నుండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకుంటున్న భూ అమ్మకం దారులు… ప్రభుత్వానికి టాక్స్ లు వేసేటప్పుడు ఉండే శ్రద్ధ , మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఉండదని, పురాతన భవనంలో గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నడుపుతున్న అధికారులు, అవసరాల కు అనుగుణంగా, నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న వినియోగదారులు.. ఇక, రద్దీగా మారింది కాకినాడ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. రేపటి నుంచి చార్జీలు పెరగడంతో క్రయవిక్రయదారులతో నిండిపోయిన కార్యాలయాలు.. మామూలు రోజుల కంటే మూడు రెట్లు రిజిస్ట్రేషన్ పెరిగాయని చెబుతున్న అధికారులు.. డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి హడావిడిగా రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న జనాలు..