Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్.. ఫుల్ లిస్ట్ ఇదేనా?
- Mega158పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్
- మెగా క్యాస్టింగ్ వివరాలు చక్కర్లు
- క్యాస్టింగ్ ఫుల్ లిస్ట్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మెగాస్టార్’ చిరంజీవి తాజా చిత్రం ‘Mega158’ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మెగా క్యాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్, విలన్, డాటర్ క్యారెక్టర్స్‌కు సంబధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో.. మెగా అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. స్టార్ పవర్‌తో పాటు బలమైన నటన కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
Mega158లో చిరంజీవి లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మలయాళ సినీ లెజెండ్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారనుందని చెప్పొచ్చు. విలన్ పాత్రకు సంబంధించిన అప్‌డేట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
Also Read: Peddi Release Date: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే!
ఫ్యామిలీ ఎమోషన్‌కు బలం చేకూర్చే పాత్రల్లో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలక రోల్‌లో నటిస్తున్నారు. ప్రియమణి గ్లామర్, నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి కుమార్తె పాత్రలో యంగ్ టాలెంట్ సారా అర్జున్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధురంధర్ సినిమాతో సారా నేషనల్ స్టార్ అయిన విషయం తెలిసిందే. తండ్రి–కూతురు ఎమోషన్ సినిమాకు హార్ట్ టచ్ చేసే ఎలిమెంట్‌గా మారనుందని అంచనా. దర్శకుడు బాబీ ఇప్పటికే తన టెక్నికల్ టీమ్‌ను బలంగా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇంత పవర్‌ఫుల్ క్యాస్టింగ్, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కుతున్న Mega158 సినిమా విడుదలైన రోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!