కర్నూలులో హైకోర్టు బెంచ్.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. 28-10-2024 లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్ న్యాయవాది యోగేష్.. అయితే, బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయమని న్యాయస్థానం పేర్కొంది.. ఆ లేఖ తమపై ప్రభావం చూపదన్న న్యాయస్థానం.. స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్ ల ఏర్పాటు మీద వివరాలు తెప్పించుకున్నట్టు వ్యాఖ్యానించింది.. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నామని న్యాయస్థానం చెప్పింది.. అసలు బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా..? అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు న్యాయమూర్తి.. అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్టని.. అది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు పిటిషనర్.. లేఖ సారాంశం బెంచ్ అవసరం ఇప్పటికే ఉందని, బెంచ్ ఏర్పాటుకి తీసుకున్నట్టు, బెంచ్‌ని కర్నూల్ లో ఏర్పాటు చేస్తున్నట్టు ఉందని.. ఇదంతా న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్టే అని పిటిషనర్ పేర్కొన్నారు.. కాబట్టి బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన పై స్టే ఇవ్వాలని కోరారు.. అయితే, మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు.. ఉండక పోవచ్చు.. కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది హైకోర్టు.. కానీ, మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్ ను పెండింగ్ లో పెట్టాలని పిటిషనర్ కోరగా.. 3 నెలలకి వాయిదా వేసింది హైకోర్టు..
కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మిర్చి రైతులను ఆదుకోండి..
మిర్చి రైతులను ఆదుకొండి అంటూ కేంద్రానికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం… మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.. సాగు వ్యయానికి, విక్రయధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.. గుంటూరు.. కర్నూలు.. నంద్యాల ఇలా ఎక్కడ చూసినా కష్టాలే.. ఎకరాకు లక్షల్లో ఖర్చు.. దిగుబడి తగ్గడం.. ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక తీవ్ర ఆందోళనలో ఉన్నారు మిర్చి రైతులు. ఈ సమయంలో 50 శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టాన్ని కేంద్రం భరించాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రికి పపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.. సీఎం చంద్రబాబు ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు.. ఇప్పటికే రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. మిర్చి రైతుల సమస్యలు వివరించి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. డిసెంబర్ 26, ఫిబ్రవరి 5, 11 తేదీల్లో కేంద్రానికి లేఖలు కూడా రాశామని.. వెల్లడించారు సీఎం చంద్రబాబు.. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర పెద్దలను పలుమార్లు కూటమి ఎంపీలు, కేంద్రం మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని. కేంద్రం వ్యవసాయ అధికారులతో పలు మార్లు చర్చలు జరిపారు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.. రాష్ట్రంలో మిర్చి రైతులకు సాయం చేయాలని కోరుతూ మరో సారి కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది..
చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ శివారులో.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు ఎంతో విశిష్టత ఉంది.. అయితే, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. రామరాజ్యం పేరుతో.. ఓ అర్చకుడిపై దాడి చేయడం ఏంటి అంటూ.. అంతా ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. రంగరాజన్‌కు ఫోన్ చేసిన వైఎస్ జగన్.. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమైన విషయం అన్నారు వైఎస్ జగన్..
కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్.. నాకు సంబంధం లేదు..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని.. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్య వర్ధన్.. ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతారు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.. మరోవైపు, వల్లభనేని వంశీ మోహన్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి.. మిగతా ఇద్దరి నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం.. మొత్తం ముగ్గురు కస్టడీ పిటిషన్లు మీద విచారణ పూర్తి అయ్యాక తీర్పు ఇవ్వనుంది కోర్టు..
కేసీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు తేదీ ఖరారు..
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని.. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసన్నారు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని.. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఒర్లకండిరా బాబు.. దండం పెడతా.. కార్యకర్తలపై కేసీఆర్ అసహనం
తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోగానే పార్టీ శ్రేణులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేడర్ తోపులాటతో అసహనానికి గురైన కేసీఆర్ ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధం చేసేలా కార్యాచరణపై చర్చించనున్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో చేసిన పోరాటాలపై సమీక్ష, భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. ఏప్రిల్ లో జరపబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. హైదరాబాద్ లేదా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా సత్తాచాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నా ఫ్రెండ్తో నా వైఫ్ లేచిపోయింది.. సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడి
ప్రేమించి, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి 12 ఏళ్ల పాటు కాపురం చేసిన ఓ జంట. అయితే, ఆ వివాహిత మరొకరి మీద మోజుపడి కట్టుకున్నోడికి తీరని అన్యాయం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలు తీసుకున్నాడు. తన స్నేహితుడే భార్యను లేపుకెళ్లాడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ భర్త సెల్ఫీ వీడియో తీసుకుని.. తన చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని వెల్లడించాడు. తనకు న్యాయం చేయాలని ఫ్రెండ్స్ ను కోరుతూ ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు.
ఈ హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం నాడు కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాగేష్ (35), 12 ఏళ్ల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అయితే, అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక, ఇటీవల ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకుని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 90KM రేంజ్
పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లను కొనేందుకు వాహనదారులు ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. ఈ క్రమంలో ప్రముఖ టీవీలర్ తయారీ కంపెనీలన్నీ స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో లాంగ్ రేంజ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. జైపూర్ కు చెందిన BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ అర్భన్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ LOEV+ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్ తో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. BattRE LOEV Plus Electric Scooter ధర రూ. 69,999 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది ఒకినావా రిడ్జ్ ప్లస్, ఓలా S1X లకు గట్టిపోటీనిస్తుంది.డిజైన్ పరంగా BattRE LOEV+ అనేక కట్స్, క్రీజ్‌లతో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీనికి స్ప్లిట్ LED హెడ్‌లైట్ అమర్చారు. హ్యాండిల్ బార్ కౌల్ ఇంటిగ్రేటెడ్ DRL ని పొందుతుంది. LOEV+ ఐదు కలర్స్ లో లభిస్తుంది. స్టార్‌లైట్ బ్లూ, స్టార్మీ గ్రే, ఐస్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, పెర్ల్ వైట్.
రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?
దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖుంగా ఆయన చేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ సంపాదించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్‌పై కూడా మెరుస్తుంటారు. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా అవసరానికి గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి నటించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పెద్ద విషయం కాదు కానీ వాళ్లిద్దరి మధ్య లవ్‌ట్రాక్ సీన్స్ ఉండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు నటించారని? ఆశ్చర్యపోతూ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే? విక్రమార్కుడు సినిమా రిలీజ్ టైంలో స్టార్ మా(అప్పటి మా టీవీ) ‘యువ’ అనే తెలుగు సీరియల్ వచ్చేది. ఆ సీరియల్లో రష్మీ రేడియో జాకీ పాత్రలో నటించగా విక్రమార్కుడు ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి ఆ సీరియల్లో గెస్ట్ రోల్లో మెరిశారు. ఈ క్రమంలోనే ఆయన రష్మీతో కలిసి ఒక లవ్ ట్రాక్ లో నటించారు. ఈ సీన్లో రష్మీని ప్రేమించే వ్యక్తిగా ఆయన్ని చూపారు. ఎందుకు వైరల్ అవుతుందో తెలియదు కానీ ఆ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రష్మీతో జక్కన్న ‘లవ్ స్టోరీ’, ‘రాజమౌళి- రష్మీ ఎప్పుడు నటించారు?’, ‘ఈ లవ్ ట్రాక్ భలే ఫన్నీగా ఉంది’ అంటూ నెటిజన్ల కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
సినిమా ముందు యాడ్స్ వేసినందుకు లక్ష ఫైన్
25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా 3 టిక్కెట్లు కొనుగోలు చేశాడు. సాయంత్రం 4:05 గంటలకు పడాల్సిన ఈ సినిమా సాయంత్రం 6:30 గంటలకు ముగియాల్సి ఉంది. కానీ సినిమా ప్రదర్శన సాయంత్రం 4:05 గంటలకు ప్రారంభం కావడానికి బదులుగా 4:30 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 30 నిమిషాల విలువైన సమయం వృధా కావడం వల్ల షెడ్యూల్ చేసిన పనులకు హాజరు కాలేకపోయాను. దీనివల్ల తనకు నష్టం వాటిల్లిందని అభిషేక్ ఫిర్యాదు చేశాడు. ప్రకటనలను ప్రదర్శించడం ద్వారా అనవసర లాభం పొందడానికి షో సమయాన్ని తప్పుగా కోట్ చేశారని కోర్టులో వాదించారు. ఈరోజుల్లో సమయాన్ని డబ్బుగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి సమయం చాలా విలువైనది. ఇతరుల సమయం, డబ్బు నుండి లాభం పొందే హక్కు ఎవరికీ లేదు.