CM Chandrababu: మిర్చి రైతులను ఆదుకొండి అంటూ కేంద్రానికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం… మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.. సాగు వ్యయానికి, విక్రయధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.. గుంటూరు.. కర్నూలు.. నంద్యాల ఇలా ఎక్కడ చూసినా కష్టాలే.. ఎకరాకు లక్షల్లో ఖర్చు.. దిగుబడి తగ్గడం.. ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక తీవ్ర ఆందోళనలో ఉన్నారు మిర్చి రైతులు. ఈ సమయంలో 50 శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టాన్ని కేంద్రం భరించాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రికి పపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: AP High Court: కర్నూల్‌లో హైకోర్టు బెంచ్.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.. సీఎం చంద్రబాబు ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు.. ఇప్పటికే రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. మిర్చి రైతుల సమస్యలు వివరించి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. డిసెంబర్ 26, ఫిబ్రవరి 5, 11 తేదీల్లో కేంద్రానికి లేఖలు కూడా రాశామని.. వెల్లడించారు సీఎం చంద్రబాబు.. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర పెద్దలను పలుమార్లు కూటమి ఎంపీలు, కేంద్రం మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని. కేంద్రం వ్యవసాయ అధికారులతో పలు మార్లు చర్చలు జరిపారు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.. రాష్ట్రంలో మిర్చి రైతులకు సాయం చేయాలని కోరుతూ మరో సారి కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది..