Minister Nara Lokesh: విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.. వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్వవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందన్నారు లోకేష్. జీవో నంబర్ 42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుట్రపన్నారని ఈ సందర్భంగా ఆరోపించారు లోకేష్.. పాఠశాల, ఇంటర్మీడియెట్ , ఉన్నతవిద్యపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Health Tips: చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు.. గుప్పెడు తింటే చాలు
కాగా, సీఎం చంద్రబాబు.. ఏ శాఖ ఆశిస్తున్నారని అడిగినప్పుడు.. నాకు విద్యాశాఖ ఇవ్వండి అని అడిగాను.. అది చాలా కష్టమైన శాఖ అని అప్పుడు ఆయన అన్నారు. నువ్వు తట్టుకోగలవా అని అడిగారు. అందుకే నాకు ఆ శాఖ కావాలి అని చెప్పాను అంటూ గతంలో ఓ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్న విషయం విదితమే.. ఇక, నేను విద్యాశాఖ తీసుకుంటున్నాను అని తెలిసి చాలామంది మెసేజ్ చేశారు. చాలా కష్టమైన శాఖ అని. అందుకే నేను దానిని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా, ప్రతి ఒక్కరూ ఏదైనా సరే ఛాలెంజ్‌గా తీసుకోండి అని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ సూచించిన విషయం విదితమే..