ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్.. ఈ నెల 15వ తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు తమన్.. తలసేమియా బాధితులకు సహాయార్థం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ మ్యూజిల్ నైట్ ద్వారా వచ్చిన సొమ్మును తలసేమియా బాధితులకు అందజేయనున్నారు..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్‌కు డేట్ ఫిక్స్ చేశారు.. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. మూడు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుంగా తెలుస్తోంది..
విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. కేవలం పనులు వేగవంతం కోసమే ర్యాంకులన్న సీఎం చంద్రబాబు.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదు.. పైస్థాయి నుంచి చిరుద్యోగి వరకు పనిపై దృష్టి పెడితేనే ఫలితాలు: సీఎం చంద్రబాబు
Mopidevi Venkataramana: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, ఎన్నెన్నో ఒడి దుడుగులు ఎదుర్కొన్నాను అని తెలిపారు.
Minister Sandhya Rani: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడింది. పిచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ గా మారటమే జగన్ 2.0 అని పేర్కొంది. శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్.. విజయమ్మ, షర్మిలా ఆయుష్షు గట్టిది కాబట్టే అతడికి దూరంగా ఉంటున్నారు.
Alapati Rajendra Prasad: గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు.
Sailajanath Joins YSRCP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలో చేరానని సీనియర్ రాజకీయ నేత సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని అన్నారు.
Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాతల సహకారంతో శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో మరమ్మత్తు పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పైకప్పు లీకేజీలు అరికట్టేందుకు ఈ మరమ్మత్త పనులు నిర్వహణ కొనసాగించనున్నారు.