Peddireddy Ramachandra Reddy: మొదటి నుంచి అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తమ నేత ప్రజా సమస్యలపై మాట్లాడాలని అడిగామన్నారు. అందరూ సభ్యుల లాగే అసెంబ్లీలో అవకాశం ఇస్తే తమ నేత వైఎస్ జగన్ కు కూడా కేవలం ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ ను అడిగామని.. కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. కానీ, వారు ఇంత వరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వం తమ అభ్యర్థనకు పాజిటివ్ స్పందిస్తుందనే నమ్మకం లేదన్నారు పెద్దిరెడ్డి.. అయితే, ప్రతిపక్ష హోదా వచ్చే వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామంటున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా.. గవర్నర్ ప్రసంగం సమయంలోనే.. సభలో ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన విషయం విదితమే.. ఈ సందర్భంగా ఎన్టీవీవో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..