అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో అనంతపురం గంగమ్మ తల్లిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. కాగా.. మార్చి 1, 2 తేదీలలో అనంతపురం శ్రీ గంగమ్మ జాతర జరగనుంది. జాతర సందర్భంగా జిల్లా స్థాయి అధికారులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు, మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత జిల్లా స్థాయి అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
Read Also: Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..
గంగమ్మ జాతర నిర్వహణ పై ఎన్టీవీ, భక్తి టీవీతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. మార్చి 1, 2 తేదీలలో జరిగే అనంతపురం గంగమ్మ జాతరను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. భక్తులను దృష్టిలో ఉంచుకొని అందరికీ అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపడతాం.. గంగమ్మ జాతర విజయవంతం కోసం అధికారులు సహకరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు.
Read Also: Crime News: బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఇంట్లోనే ఉన్న బావిలో పడేసిన నిందితులు