YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.. గత రెండు రోజులుగా ఆయన ఫీవర్‌తో బాధపడుతోన్నట్టుగా తెలుస్తుండగా.. అయినా, ఈ రోజు కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు మాజీ సీఎం.. పులివెందుల పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆయన ఆరా తీశారు. అంతేకాకుండా తన కంటికి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు… ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మరియు రాజారెడ్డి ఐ సెంటర్ సంయుక్తంగా చేపడుతున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కాగా, నిన్న, ఈ రోజు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్.. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందుల నుంచి బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు.. ఇక, వచ్చే నెల 3వ తేదీ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారట వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: MLC Elections 2025: ఏపీలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. పగడ్బందీగా ఏర్పాట్లు..