Vallabhaneni Vamsi Case: హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పిటిషన్.. ఆ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలి..!
- హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ పిటిషన్..
- పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలి..
- పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని పేర్కొన్న ఆమె.. వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలని పంకజ శ్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, విచారణ సందర్భంగా వల్లభనేని వంశీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ భద్రపరచాలంటూ విజయవాడ పటమట పోలీసులకు వినతిపత్రం సమర్పించామని హైకోర్టుకు వివరించారు.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పటమట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచాలని పోలీసులను కోరాం.. కానీ, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ తరఫున న్యాయవాది.. అయితే, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు ప్రభుత్వం తరఫున న్యాయవాది.. దీంతో, తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: Minister Seethakka: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్..
Also Read
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!