జనాభా లెక్కలు పూర్తయ్యాక.. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం..
ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా.. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంది.. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు రెడీగా ఉన్నాం.. ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లోనే కమిటీని ఏర్పాటు చేశాం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషనలైజేషన్, కేటగిరీలపై 2000 ఏడాదిలో చట్టం చేశామని ఆయన గుర్తు చేశారు. కానీ, ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ రీసెర్చ్ చేసింది.. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా కొనసాగిందన్నారు. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు..
సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు. సూపర్ సిక్స్ కు నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తోంది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదు.. ఓటేశారు.. మేం గెలిచాం.. ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ఈ ప్రభుత్వం ఉంది.. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం.. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం.. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు.. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి.. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది.. ఆ కేసులను ఎత్తేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్త కాదు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అహంకారి, దోర అని విష ప్రచారం చేశారని అన్నారు.. 30 వేల రుణ మాఫీ డబ్బులు డిల్లీ పెద్దలకు చేరినాయి.. సూర్యాపేట జిల్లాకు సాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారమే.. ప్రజల అభిమానం కాదు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు ఏనాటికైనా శత్రువే.. బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. బండెనక బండి కట్టి.. ఏప్రిల్ 27న వరంగల్ సభకు ప్రజలు కదిలి రావాలి.. అసెంబ్లీ లో జగదీష్ రెడ్డి మంట్లడిందాంట్లో తప్పులేదు.. స్పీకర్ కు కులం ఆపాదించడం దురదృష్టకరం.. గడ్డం ప్రసాద్ స్పీకర్ కావాలని బీఆర్ఎస్ పోటీ కూడా పెట్టలేదు.. అసెంబ్లీనీ గాంధీభవన్ తో పోల్చిన ఎంఐఎంపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం
నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధులో అనర్హులకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారని విమర్శించారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటకి లాగాలనే రుణమాఫీ చేశామన్నారు. కేసీఆర్ చేసింది వడ్డీ మాఫీ మాత్రమే అని.. రుణమాఫీ చేయలేక కేసీఆర్ చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో రెండు మాత్రమే అమలు కాలేదని.. అవి కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. “కేసీఆర్ ఎప్పుడైనా వ్యవసాయ కూలీల గురించి ఆలోచించారా? ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉచిత విద్యుత్ వల్ల తెలంగాణలో దాదాపు ఎనభై శాతం మందికి ఉపయోగపడుతోంది. కేసీఆర్ హయాంలో ఉప ఎన్నికలు ఎక్కడొస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు.
నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. వచ్చే మార్చి 31 వరకు..
నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు ‘నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన వైఖరితో ముందుకు సాగుతోందని.. లొంగిపోవడం కోసం అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని మావోయస్టులు పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో18 మంది మావోయిస్టులు హతం అయ్యారు. అలాగే ఒక జవాను కూడా చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఈ ఎదురుగాల్పులు జరిగాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్మద్‌లో మావోలు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడు కారణంగా ఒక జవాన్, ఒక అధికారి కళ్లలోకి దుమ్ము, బురద వెళ్లినట్లుగా తెలిపారు. చికిత్స కోసం వారిని వేరే ప్రాంతానికి తరలించారు.
ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహమే.. ఔరంగజేబు వివాదంపై యోగి వార్నింగ్..
దేశవ్యాప్తంగా ఔరంగజేబు సమాధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నాగ్‌పూర్‌లో అల్లర్లకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణదారులను కీర్తించే వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది కొత్త భారతదేశమని, ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహ చర్య అని అన్నారు. ఔరంగజేబు పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసి, మన విశ్వాసంపై దాడి చేసిన వ్యక్తులను కీర్తించడంపై యోగి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఆక్రమణదారులను కీర్తించడం అంటే దేశద్రోహం యొక్క మూలాలను బలోపేతం చేయడం. మన గొప్ప పూర్వీకులను అవమానించే వారిని మరియు మన నాగరికతపై దాడి చేసిన, మన మహిళలను ఉల్లంఘించిన, మన విశ్వాసంపై దాడి చేసిన వారిని ప్రశంసించే వారిని న్యూ ఇండియా ఎప్పటికీ అంగీకరించదు’’ అని బహ్రైచ్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి అన్నారు. ప్రపంచం మొత్తం భారత గొప్ప వారసత్వాన్ని గుర్తిస్తున్నప్పుడు, మన గొప్ప నాయకులను గౌరవించడం ప్రతీ పౌరుడి విధి, మన గుర్తింపుని తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన వారిని ప్రశంసించడం కాదు అని ఆయన అన్నారు.
ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు!
బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడని కేసు నమోదైన క్రమంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వెల్లడించింది .
పూరీ – విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ను వదలని ఛార్మి?
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూరీ సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతుందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, అవి నిజం కాదని తాజా సమాచారం ద్వారా తేలింది. పూరీ జగన్నాధ్‌తో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఛార్మి, ఈ ప్రాజెక్ట్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాల తర్వాత వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న పూరీకి ఈ సినిమా ఒక గట్టి కమ్‌బ్యాక్‌గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అన్ని భాషల్లో అందుబాటులో ఉంటే, అదే పేరును అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
చాహల్, ధనశ్రీ వర్మల వివాహబంధానికి తెర.. కోర్టు విడాకులు మంజూరు
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకుల పిటిషన్ కోసం మధ్యాహ్నం బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన వీరికి.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ కొన్నాళ్లుగా వారిద్దరి మధ్య విభేదాలు పెరిగాయని.. ఆ కారణంగా విడాకుల కోసం ఫిబ్రవరి 5, 2025న ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల ఒప్పందం ప్రకారం.. చాహల్ ధనశ్రీకి రూ. 4.75 కోట్లు భరణంగా చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. ఈ మొత్తంలో ఇందులో ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించాడు. మిగిలిన మొత్తం కోర్టు తీర్పు అనంతరం చెల్లించనున్నాడు. ఈ భరణం గురించి సమాచారం లభించినప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఐపీఎల్‌లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఎం.ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య హైఓల్టోజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు లక్నోలో ఆడినప్పుడు.. వారి అభిమానులు స్టేడియంలో అధికంగా ఉంటారని.. ఈ ట్రెండ్ మార్చడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జహీర్ ఖాన్ సరదాగా స్పందించారు. “ఎంఎస్ ధోని ఉన్నంత కాలం, ఏ స్టేడియమైనా పసుపుమయంగా మారుతుంది. ధోనికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం.. ఇది కొనసాగుతూనే ఉంటుంది,” అని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ లక్నోలో ఆడినప్పుడల్లా స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీలే దర్శనమిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 14, 2024న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా స్టేడియం పసుపుమయంగా మారింది. ఆ మ్యాచ్‌లో ధోని కేవలం తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేశాడు. 3 బౌండరీలు, 2 సిక్సర్లతో అభిమానులను ఉత్సాహపరిచాడు.