కీలక బిల్లుకు శాసనసభ ఆమోదం
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సునీత విలియమ్స్ కు అభినందనలు.. శుభాకాంక్షలు చెప్పింది శాసనసభ… సునీత విలియన్స్ జీవితం స్ఫూర్తి దాయకం అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. తర్వాత అసెంబ్లీ లో క్వశ్చన్ అవర్ ప్రారంభం అయింది.. సంచార పశువైద్యశాలలు… విశాఖ స్టీల్ ప్లాంట్ భూములలో. రైతులకు నష్టపరిహారం.. ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యం..ఈ అంశలకు సంబంధించి చర్చ జరిగింది.. సంచార పశువైద్యశాలలకు సంబంధించి గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సభ్యులు ప్రశ్నించారు.. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.. ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని మంత్రి అచ్చం నాయుడు హామీ ఇచ్చారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటి వైద్యనికి సంబంధించి చర్చ జరిగింది.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి సత్యకుమార్ ..క్యాన్సర్ కేర్ సెంటర్లు.. ట్రామా సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ కూడా మెరుగైన వైద్యంపై దృష్టి పెడతామని సత్యకుమార్ చెప్పారు.. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు ప్రవేశపెట్టారు..ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది గతంలో ఉపాధ్యాయ బదిలీల్లో ఎలాంటి పారదర్శకత్వం ఉండేది కాదన్నారు మంత్రి లోకేష్.. బదిలీల్లో అనేక అవకతవకలు జరిగాయి అన్నారు.. ఇలాంటి వాటిని అరికట్టి బదిలీల్లో పారదర్శకత తేవడం.. విద్యావిధానం అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చాం అన్నారు మంత్రి లోకేష్..
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం.. రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటిపోవడంతో.. తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం.. అయితే, కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.. రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థ ఎంపిక చేశారు.. విశాఖలో 84.47 లక్షలు, విజయవాడలో 81.68 లక్షలతో ప్లాన్ రూపొందించనుంది సంస్థ.. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం..
అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్..
కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.. ఇక, ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనుండా.. ఫేజ్-2లో 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు..
10 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..!
గత 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి నారా లోకేష్.. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ప్రారంభించారు లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.. ఇక, ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనుండా.. ఫేజ్-2లో 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2022లో మల్లవల్లి పారిశ్రామిక వాడలో నేను పాదయాత్ర చేశాను.. అప్పుడు అశోక్ లేలాండ్ ఫ్లాంట్ నిర్మాణం నిలిపివేసి ఉంది. 2019-24 మధ్య ఏపీలో అనేక పరిశ్రమలు తరలి వెళ్లాయి.. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాని పరిస్థితిని ఆనాటి పాలకులు తెచ్చారని ఫైర్ అయ్యారు.. 2014-2019లో చేసిన ఒప్పందాలకు గత పాలకులు అర్ధం లేకుండా చేశారన్న లోకేష్.. వారి ధన దాహానికి పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిశ్రమలు ఏర్పాటు పై దృష్టి పెట్టాం.. అశోక్ లేలాండ్ సంస్థ ముందుకు వచ్చి ఫ్లాంట్ నిర్మాణం చేసింది.. అత్యాధునిక సౌకర్యాలతో వివిధ రకాల బస్సులు తయారు చేస్తున్నారు.. వేలాది మందికి ఈ సంస్థ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు.. ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో అశోక్ లేలాండ్ సంస్థ విధానాలను అమలు చేస్తుందన్న ఆయన.. మచిలీపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు త్వరలో రానుందన్నారు.. ఇక, గత పది నెలల్లో ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీకి వచ్చాయని.. నాలుగు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు..
టీచర్ పోస్టుల భర్తీపై పిల్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో 27,400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. 27 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.. రూల్ 24 (3) కింద ప్రతి ఏడాది రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, 2018 తర్వాత ఇప్పటి వరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదని హైకోర్టులో గోడు విన్నవించుకున్నారు పిటిషనర్.. ఈ విషయంలో పొలిటికల్ గా కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కూటమి సర్కార్‌ను ఆదేశించింది.
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత మద్యం మార్కెట్లో నూతన బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Prohibition & Excise Department) ఇప్పటికే కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం తెలిపింది. ప్రారంభంలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 వరకు గడువు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు దానిని ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ మద్యం పంపిణీ సంస్థ (TGBCL)కి కొత్త మద్యం, బీరు బ్రాండ్ల సరఫరాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 39 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని కంపెనీలు ఈ గడువు పొడిగింపును ఉపయోగించుకొని తమ దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండయా హెడ్ దేశాంత కైలా చర్చల్లో ఉన్నారు. మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
శశిథరూర్ వ్యాఖ్యలతో బీజేపీలో ఆనందం.. కాంగ్రెస్‌లో మౌనం..
ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు మోడీ దౌత్య వైఖరిని తప్పుబడుతూ మూర్ఖంగా(ఎగ్ ఆన్ ఫేస్) వ్యవహరించానంటూ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనియాడారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా, సొంత పార్టీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది. థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘శశి థరూర్ అంగీకరించిన విధంగా, కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కూడా చేయాలి’’ అని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ థరూర్ నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేత సంబిత్ పాత్ర చెప్పారు. ‘‘”శశి థరూర్ దౌత్యాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన చాలా కాలంగా ఐక్యరాజ్యసమితిలో ఉన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో ప్రధాని మోడీ వైఖరిని ఆయన అభినందించారు. కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు కూడా ప్రతిసారీ ప్రధాని మోడీకి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే బదులు శశి థరూర్ నుండి నేర్చుకోవాలి… మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ ముందుకు వచ్చి శశి థరూర్ వైఖరిని అభినందించాలి’’ అని అన్నారు. కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. శశిథరూర్ నిజాయితీని మెచ్చుకుంటున్నానని చెప్పారు.
ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’తో వొడాఫోన్ ఐడియా చర్చలు..
భారత టెలికాం దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఒప్పందాలు ప్రకటించాయి. ఇప్పటికే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ స్పేస్ ఎక్స్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కూడా స్టార్‌లింక్‌తో సహా వివిధ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లతో చర్చల్ని ప్రారంభించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. ఈ వార్త రాగానే బుధవారం వొడాఫోన్ ఐడియా షేర్లు దాదాపుగా 5 శాతం పెరిగాయి. ‘‘ఎక్కడైతే శాటిలైట్ సేవలు సరిగ్గా సరిపోతాయో , కవరేజ్ లేని ఏరియాల్లో సేవల్ని అందించడం మా వ్యూహం’’ అని వోడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ అన్నారు. గతవారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారతదేశానికి తీసుకురావడానికి భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా, భారతీయ ఆపరేటర్లు స్టార్‌లింక్ పరికరాలను వారి రిటైల్ స్టోర్లలో అమ్ముతారు.
కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ నుండి హ్యూండాయ్ కార్ల ధరల పెంపు
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలను ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఈ ధర పెంపునకు పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, కమ్మోడిటీ ధరలు, ఇంకా అధిక ఆపరేషనల్ వ్యయాలు ప్రధాన కారణాలు అని వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా వంటి ఇతర ఆటోమొబైల్ బ్రాండ్లు ఏప్రిల్ నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు హ్యూండాయ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇతర కంపెనీల మాదిరిగానే హ్యూండాయ్ కూడా పెరిగిన ఉత్పత్తి ఖర్చులను వినియోగదారులపై బరువుగా మోపాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.
గాయం నుండి పూర్తిగా కోలుకోని బుమ్రా.. ఐపీఎల్ 2025కు అందుబాటులో ఉంటాడా?
భారతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఐపీఎల్ 2025 ప్రారంభంలో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులో ఉండడంలేదని ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా లేని లోటును ముంబయి ఇండియన్స్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా బౌలింగ్ విభాగానికి వెన్నెముక. అతడు తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బుమ్రా, తక్కువ సమయంలోనే భారత బౌలింగ్ దళానికి కీలక ఆటగాడిగా మారాడు. అతని స్పీడ్, యార్కర్లు, డెత్ ఓవర్లలో అద్భుతమైన నియంత్రణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచాడు. కానీ, గాయాలు అతడి కెరీర్‌ను పలుమార్లు ప్రభావితం చేశాయి. ఈ ఏడాది మొదట్లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా, ఆ గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో కూడా అతడు ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ 2025 ప్రారంభంలో కనీసం మూడు మ్యాచ్‌లకు అతడు దూరం అయ్యే అవకాశం కనపడుతుంది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ధృవీకరించాడు.
కన్నప్ప నుంచి మహాదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్..
మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహాదేవ శాస్త్రి పాత్రలో కలెక్షన్ కింగ్ నటిస్తున్నారు. ఆయన పాత్ర గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేశారు. ఇందులో ఆయన నడుచుకుంటూ వస్తున్న టైమ్ లో అందరూ మోకాళ్లపై వంగి నమస్కరిస్తుంటారు. దానికి తగ్గట్టు ఆయన పాత్రను పరిచయం చేసే సాంగ్ ను రూపొందించారు. ‘ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ.. ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ’ అంటూ సాగే పాట వైబ్రేషన్ తెప్పించేదిగా ఉంది. ఈ గ్లింప్స్ ను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేశారు. క్షణాల్లోనే ఈ గ్లింప్స్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఆయన అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మొదట్లో ఈ మూవీపై ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేస్తుండటంతో హైప్ బాగా పెరిగిపోయింది.
మళ్లీ ఫొటో లీక్.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!
రాజమౌళికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎస్ ఎస్ ఎంబీ-29 నుంచి లీకులు ఆగట్లేదు. మొన్న ఒడిశాలో సెట్స్ నుంచి ఏకంగా వీడియోనే లీక్ అయి సోషల్ మీడియాను ఊపేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రిలీజ్ కు ముందే కథ లీక్ అయిపోతుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సెట్స్ వద్ద రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మూవీ టీమ్ చెబుతోంది. సెక్యూరిటీ టైట్ చేశాడని.. చిన్న లీక్ కూడా ఉండదనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అదే ఒడిశా సెట్స్ నుంచి మరో ఫొటో లీక్ అయిపోయింది. ఇందులో మహేవ్ బాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బ్యాక్ నుంచి తీసిన ఈ ఫొటోలో మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నేటితో ఒడిశా షెడ్యూల్ పూర్తి అయింది. చివరి రోజు ఇలా లీక్ కావడంతో.. ఇది చూసిన వారంతా అసలు ఎందుకు లీక్ చేస్తున్నారనే ప్రశ్నలు వేస్తున్నారు. కావాలని చేస్తున్నారా.. లేదంటే అనుకోకుండా జరుగుతోందా అని ఆరా తీస్తున్నారు. ఎలా జరిగినా మూవీకి కావాల్సినంత బజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతోందని అంటున్నారు ఫ్యాన్స్. కానీ రాజమౌళి సినిమా అంటే లీకులు అనే విషయమే ఉండదు. ఎందుకంటే లీకులు ఇస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే విషయం ఆయనకు తెలుసు.