Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రేపు తుది తీర్పు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.
Read Also: IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు బౌలర్లకు గుడ్ న్యూస్..
మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీని ప్రశ్నించేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన విజయవాడ సీఐడీ న్యాయస్థానం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారణ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఈ కేసులో A71గా ఉన్న వంశీ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు.