CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోచంద్రబాబుతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు.. టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు.. నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచాను.. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Trump-Modi: మోడీపై ట్రంప్ ప్రశంసలు.. తెలివైన వ్యక్తి అంటూ కితాబు
ఇక, ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు. టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు అంటూ సెటైర్లు వేశారు. నాకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావు.. క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇక, 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశాం.. చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయి.. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం.. ఎక్కడికక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.