టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి మాట్లాడుతూ.. “నిజమైన తెలుదేశం కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవటానికి పుట్టిన పార్టీ అని చెప్పారు.. ఆయన చెప్పిన చరిత్ర మామూలు చరిత్ర కాదు.. టీడీపీ ఆవిర్భవించిన రోజు చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారు.. ఇందిరా గాంధీ ఆజ్ఞాపిస్తే ఆయన మామ చంద్రబాబు మీదే పోటీ చేస్తా అన్నాడు.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ జెండా పక్కన భారతదేశంలో ఉన్న అన్నీ పార్టీల జెండాలు పెట్టారు..
Also Read:Amit Shah: ‘‘ఆయుధాలు మార్పు తీసుకురాలేవు’’.. మావోయిస్టులకు అమిత్ షా హితవు..
అధికారంలో లేనప్పుడు సూపర్ సిక్స్ అన్నారు.. వచ్చాక చేయలేమంటున్నారు.. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలకు పెట్టింది పేరు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు వణికిపోయిన లోకేష్.. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తాను చేసిన గుర్తుంచుకునే పని చెప్పగలరా.. వైఎస్ఆర్ మీ కన్నా తక్కువకాలం చేసినా ఆయన పేరు చెబితే అనేక కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి.. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు తప్ప ఏమీ గుర్తు రాదు.. ఈ పార్టీ కాదు ఇంకొక పార్టీ వీటిని తోసేస్తాడు.. రెండెకరాల చంద్రబాబు రెండువేల కోట్లకు పడగలెత్తాడు..
Also Read:Rahul Gandhi: బీజేపీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేసింది..
చంద్రబాబు కుమారుడు కాబట్టే లోకేష్ మంత్రి అయ్యాడు.. కాంట్రాక్టర్ల కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టారు.. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పీ4 అంటున్నారు.. అమరావతిని కూడా పరిపూర్ణం చేసే శక్తి చంద్రబాబుకు లేదు.. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఇంకా మా ప్రభుత్వం మీదే నిందలు వేస్తారు.. దోచుకోవటం.. దాచుకోవటం తప్ప చంద్రబాబుకు ఏమీ తెలియదు.. ఓటుకు నోటులో టక్కున దొరికిపోయిన చంద్రబాబు.. ఏపీలో ఎన్నికలకు ఇంత ఖర్చు అవుతుంది అంటే అది చంద్రబాబు పుణ్యమే.. ఎక్కడి వెళ్ళినా రెడ్ బుక్ చర్చ జరుగుతుంది అని వ్యంగ్యం చేస్తున్న లోకేష్.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో మీరు ఎన్ని పాట్లు పడ్డారు..
Also Read:Rahul Gandhi: బీజేపీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేసింది..
ఎన్నో ఆరోపణలు చేసి వణికిపోయారు.. అంత అహం పనికి రాదు రాజా.. అందరి బుక్ లో నీ పేరే రాస్తున్నారు పసి రాజా.. టీడీపీకి పని చేసిన మాకు పనులు చేయాలని మీ చుట్టూ తిరుగుతున్నారు.. కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నారో చూడాలి.. మీ రెడ్ బుక్ రాజ్యాంగం చూసి భయపడే వాళ్ళు లేరు.. టీడీపీని కబ్జా చేసి మాట్లాడుతున్నారు.. అవకాశవాద రాజకీయాలతో నడుస్తున్న పచ్చ పార్టీ.. సింగిల్ గా వస్తే మీరు ఏమీ చేయలేరు అని” అంబటి రాంబాబు వెల్లడించారు.